ద్వాదశ
భావాలు – సంక్షిప్త విశ్లేషణ
జాతకుడు బాగుండాలి అంటే జాతకుని యొక్క తనూ భావము
(లగ్నము) బాగుండాలి. తనూ భావము (లగ్నము) బాగుండాలి అంటే వ్యయ స్థానము (12వ భావము) బాగుండాలి.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యయము చేయగలగాలి అంటే లాభాలు లేదా సంపాదన బాగుండాలి. అంటే లాభ స్థానం (11వ భావము) బాగుండాలి. లాభాలు లేదా సంపాధన బాగుండాలి అంటే వృత్తికి సంబందించిన
10వ భావము బాగుండాలి. ఇక్కడ వృత్తి అనగా – వ్యాపారము కావచ్చు, ఉద్యోగము కావచ్చు
లేదా నైపుణ్యము కావచ్చు. దశమ భావము బాగుండాలి అంటే అందుకు అతడు లేదా అతని తల్లిదండ్రులు
ఎంతో పుణ్యము చేసుండాలి. ఇందుకు నవమ (9వ) భావము
బాగుండాలి. నవమ భావము బాగుండాలి అంటే జాతకుడు
ఎంతో కష్టపడాలి, ఇబ్బందులను ఎదుర్కోగలగాలి. దీనికి అష్టమ (8వ) భావము (ఆకస్మిక ధనలాభము, స్పెకులేషన్ మొ. కూడా) బాగుండాలి. అష్టమ భావము బాగుండాలి అంటే సప్తమ (7వ) భావము (కళత్రము, సంబంధాలు, రిలేషన్స్ మొ.) బాగుండాలి. సప్తమ భావము బాగుండాలి అంటే శత్రు, రోగ, ఋణ స్థానము (6వ భావము) బాగుండాలి. అందుకు జాతకుని
యొక్క ఆలోచనా సరళి, సంతానము (పంచమ భావము) బాగుండాలి. అందుకు తల్లి ప్రేమ, సౌఖ్యము, విద్య, ఆహార నియమాలు మొ. (చతుర్ధ భావము) తోడ్పడుతుంది.
దానికి అందరి సహకారము (తృతీయ భావము) కావాలి.
సహకారము పొందాలి అంటే ధనము, మంచి వాక్కు (ద్వితీయ భావము) కలిగి ఉండాలి.
ద్వాదశ
భావాలలో ఒక భావమునకు మరొక భావమునకు అంతర సంబంధము (inter-link) కలిగి ఉంటుంది. కావున జాతకులు మంచి వాక్కు, నడవడి, ప్రవర్తన కలిగి ఉండవలెను.