కొన్ని పత్రికలలో, TV లలో ఇప్పుడు ఉత్తరాయణము అని కొన్నింటిలో, దక్షిణాయనము అని కొన్నింటిలో పేర్కొంటున్నారు అని, ఏది వాస్తవము అని మిత్రులు శ్రీ అద్దేపల్లి చెంచయ్య గారు మరియు శ్రీ పద్మనాభ రావు గారలు సందేహము వ్యక్తము చేసినారు. దానికి ఈ క్రింది వివరణ :
-------------------------------------------------------------------------------------------------------------
ఉత్తరాయణము
మరియు దక్షిణాయనము అనగా నేమి? హిందూ పంచాంగ వివరణలో దీనిని తరుచుగా చెప్తూ ఉంటారు.
ఖగోళశాస్త్ర
రీత్యా భూమి యొక్క భూమధ్య రేఖకు ఉత్తర భాగమును ఉత్తరార్ధగోళము
(Northern Hemisphere), దక్షిణ
భాగమును దక్షిణార్ధగోళము (Southern Hemisphere) అందురు. హిందూ పంచాంగ రీత్యా సూర్యుడు ఉత్తరార్ధగోళములో సంచరించే కాలమును ఉత్తరాయణము
అని, అదేవిధంగా దక్షిణార్ధగోళములో సంచరించే
కాలమును దక్షిణాయనము అందురు.
సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నప్పటికి, భూమిపైనున్న మనకు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుచున్నట్లు అగుపించును.
ఆ ప్రకారం హిందూ పంచాంగం ప్రకారం గోచార (గ్రహ
సంచార) రీత్యా సూర్యుడు ఉత్తరార్ధగోళము వైపు సంచరించు ఆరు నెలల కాలమును ఉత్తరాయణము
అని, దక్షిణార్ధగోళము వైపు సంచరించు
ఆరు నెలల కాలమును దక్షిణాయనము అందురు. సూర్యుడు
ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉండి, మరొక రాశిలోకి
ప్రవేశిస్తాడు. ఇలా, ఒక రాశి నుండి మరొక రాశిలో సూర్యుడు ప్రవేశించడానిని సంక్రమనము
అందురు. ఉదాహరణకు .... మేష సంక్రమనము, వృషభ సంక్రమనము .... ఆ విధంగా ధనసు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడానిని
మకర సంక్రమణం అందురు. దానినే మనము మకర సంక్రాంతి
అని కూడా పిలుచుకొంటున్నాము. మకర రాశిలోకి
సూర్యుడు ప్రవేశించిన సమయము నుండి 6వ రాశి అయిన మిధున రాశి వరకు (అనగా 6 నెలలు) సూర్యుడు సంచరించిన కాలమును ఉత్తరాయణము అందురు. ఆదేవిదంగా, సూర్యుడు కర్కాటక సంక్రమనము (అనగా ప్రవేశము)
మొదలుకొని అక్కడి నుండి 6వ రాశి అయిన (అనగా 6 నెలలు) ధనసు రాశి వరకు సంచరించు కాలమును
దక్షిణాయనము అందురు.
పై వివరణ ప్రకారము సూర్యుడు ప్రస్తుతము మిధున
రాశిలో 16 డిగ్రీలల 06 నిమిషాల 34 సెకనులలో ఉన్నాడు. కావున ప్రస్తుతము ఉన్నది ఉత్తరాయణ పుణ్యకాలమే. సూర్యుడు
జూలై 2019, 17 తేదీన తెల్లవారుజామున గం. 04.41
నిముషాలకు కర్కాటక సంక్రమనము (ప్రవేశము) చేయబోవుచున్నాడు. అప్పటి నుండి దక్షిణాయనము
ప్రారంభము అగును.