అయనాంశ
– సాయన, నిరయన రాశి చక్రము
ఆకాశములో
సూర్యుడు పరిభ్రమించగలిగే మార్గాన్ని “రవి మార్గము” అందురు. అంటే సూర్యుడు పన్నెండు రాశులగుండా ప్రయాణించి
ఏడాదికి ఒక చుట్టు తిరిగి వచ్చే మార్గము.
ఇది స్థిరంగా ఉంటుంది (వాస్తవానికి
ఇది సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూకక్ష్య).
ఈ రవి మార్గాన్ని 23 ½ డిగ్రీల వాలులో
భూమధ్య రేఖ రెండు బింధువుల వద్ద ఖండిస్తుంది.
ఈ ఖండన బింధువులను “విషవత్తులు” (equinoxes) అని
అందురు. ఒకటి వసంత విషవత్తు, రెండు శరద్విషవత్తు. వసంత
విషవత్తును (ఉత్తర విషవత్తు) ప్రారంభ బింధువుగా స్వీకరించి రాశి చక్రాన్ని 12
భాగాలు చేసే పద్దతిని “సాయన” రాశి చక్రము అందురు. ఈ బింధువు స్థిరంగా ఉండదు. సంవత్సరానికి 50.24 సెకనుల చొప్పున ఈ బింధువు
సుమారు 26,000 సంవత్సరాలకు ఒకసారి రాశి చక్రము మొత్తము పూర్తిగా తిరుగుతుంది. అశ్విన్యాది నక్షత్రాల ఆధారంగా ఏర్పడిన రాశి
చక్రాన్ని “నిరయన” రాశి చక్రము అని
అందురు. ఇది స్థిరమైన రాశి చక్రము. సాయన రాశి చక్రానికి, నిరయన రాశి
చక్రానికి గల దూరాన్ని “అయనాంశ” అని అందురు.
ఈ
అయనాంశ విషయాన్ని వేరు వేరు పేర్లతో పూర్వము గుర్తించారు. ఋషులు దీనిని అగస్త్య చారమని, సప్తర్షి
చారమని అన్నారు. అయానాంశలో తేడాల వల్ల
జాతక చక్రాలు భిన్నంగా ఏర్పడుతుంటాయి.
అందువలన ఫలితములలో చాలా తేడా వస్తుంది.
అయానాంశను నిర్ణయించుటకు సాయన, నిరయన రాశి చక్రాల
ప్రారంభ బింధువులు ఏకమైన సంవత్సరము “సున్న”. అయనాంశ సంవత్సరమును వేరు వేరు శాస్త్రజ్ఞులు
వేరు వేరుగా నిర్ణయించిరి. వేరు వేరు
అభిప్రాయముల ప్రకారం ఆయన శూన్య సంవత్సరములు ఈ క్రింది విధముగానున్నవి.
N.C. లహరి ... ... ... క్రీ.శ.
285 సం.
కృష్ణమూర్తి
... ... ... క్రీ.శ.
291 సం.
బి.వి.
రామన్ ... ... ... క్రీ.శ.
397 సం.
మధుర
కృష్ణమూర్తి శాస్త్రి ... క్రీ.శ. 411 సం.
షీరో
... ... ... ... క్రీ.పూ. 388 సం.
డేవిడ్
సన్ ... ... ... క్రీ.పూ. 317 సం.
లహరి అయనాంశ రీత్యా సున్న అయనాంశ క్రీ.శ. 285 సం. ఆదివారం 22.3.285 నాటి 21
గం. 27 ని. (IST) సాయన రీత్యా, నిరయన రీత్యా
చిత్తా నక్షత్ర స్ఫుటం 1800 0’ 03” ఒకటే అయినది. భారత ప్రభుత్వము వారు ఏర్పాటు చేసిన Calendar Reforms Committee నిర్ణయించినది
కూడా క్రీ.శ. 285 సం. కావున ఇదియే సరియైనది. నిరయన పద్దతి రీత్యా లగ్న స్ఫుటం, భావ స్ఫుటం, గ్రహ స్ఫుటం నిర్ణయించడానికి అయనాంశ తప్పనిసరిగా
అవసరమున్నది.