నీచను
పొందిన గ్రహము అశుభ ఫలితములనిచ్చును. అట్టి నీచ భంగమైనచో ఆ గ్రహము చాలా శుభ
ఫలితములనిచ్చును. నీచను పొందిన గ్రహము
యొక్క నీచ భంగమైనచో దానిని “నీచ భంగ రాజయోగము” అందురు.
నీచ – భంగపడు విధానము :
1) గ్రహము ఏ రాశిలో అయితే
నీచ స్థితిని పొందినదో, ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు లేక చంద్రాత్తు
కేంద్రములందున్న నీచ భంగమగును
2) నీచను పొందిన గ్రహము
స్థితినొందిన రాశియందు ఏ గ్రహము ఉచ్చ స్థితిని పొందునో, ఆ గ్రహము
లగ్నాత్తు లేక చంద్రాత్తు కేంద్రములందున్న నీచ భంగమగును
3) నీచను
పొందిన గ్రహము లగ్నాత్తు లేక చంద్రాత్తు కేంద్రములందున్న నీచ భంగమగును
4) నీచను పొందిన
గ్రహమున్న రాశ్యాధిపతి, నీచను పొందిన గ్రహము ఉచ్చను పొందు రాశ్యాధిపతి
లగ్నాత్తు లేక చంద్రాత్తు కేంద్రములందున్న యెడల నీచ భంగమగును
5) నీచను పొందిన
గ్రహమున్న రాశ్యాధిపతి, ఆ నీచను పొందిన గ్రహము ఉచ్చను పొందు రాశ్యాధిపతి
పరస్పరము కేంద్రములందున్న నీచ భంగమగును
6) నీచను పొందిన గ్రహము
స్థితి పొందిన రాశ్యాధిపతిచే చూడబడినను నీచ భంగమగును
ఈ నీచ భంగ రాజయోగము
మొదట నీచను పొందిన గ్రహము యొక్క అశుభ ఫలితములనిచ్చును. నీచనొందిన గ్రహము మొదట కష్టములను
కలుగజేయును. తరువాత కష్టములనిచ్చుట
మానివేసి మంచి శుభ ఫలితములనిచ్చును.
ఫలితములు :
ఈ జాతకుడు ఆరోగ్యవంతుడు, గాయకుడు,
నాట్యము చేయువాడు, ధనవంతుడు,
తెలివిగలవాడు, శాస్త్ర పాండిత్యము గలవాడు, విధేయత గల భార్య గలవాడు, సుఖవంతుడు, అన్ని ప్రదేశములందును గౌరవమును పొందువాడు,
విదేశములందు నివాసము, నిత్య సంతోషి,
రాజకీయములందు నిపుణుడు, శత్రుంజయుడు అగును.
గజదొంగ, బుద్దిలేనివాడు,
క్రూరుడు, అనుమానించువాడు, పిల్లలు
లేనివాడు కూడా అగును.
ఈ ఫలితములు నీచను పొందిన గ్రహమును బట్టి ఉండును.