కాల సర్ప యోగము / దోషము
జాతకమున
కాల సర్ప యోగము పట్టిన జాతకుడు దరిద్రుడైనా, లేదా అల్పాయుర్ధాయవంతుడైనా అగును. ఈ
జాతకమున విశేష యోగములున్నను, లేక మూడు, నాలుగు గ్రహములు ఉచ్చ స్థానములో ఉన్నను, ఈ యోగ (దోష) ప్రాభల్యమంతయు పోయి సామాన్యముగా ఉండును. ధన స్థానాధిపతి (2), వాహనాధిపతి (4), భాగ్యాధిపతి (9), రాజ్యాధిపతి – ఈ నలుగురిలో నలుగురు లేదా ముగ్గురు లేదా ఇద్దరు గాని
నీచ స్థానము పొందక, శత్రు గ్రహ మధ్యస్తులుగాక, పాప గ్రహ ధృష్టులను పొందక, పాప గ్రహ సంబంధములు
లేకుండా, కేంద్ర కోణములందు గాని, స్వక్షేత్ర ఉచ్చ క్షేత్రములందు గాని ఉన్న యెడల అట్టి జాతకము సిద్దించును.
|