కుజ దోషము
వివాహ
పొంతన విషయమున గమనించవలసిన ముఖ్యాంశాములు
శ్లో .
|
ధన వ్యయేచ పాతాలే జామిత్రేచ అష్టమే
కుజ
స్త్రీనాం భర్తృ వినాశఞ్చ భర్తృనాం
స్త్రీ వినాశనం
|
(మతాంతరమున
“ధన” అను స్థానమున “లగ్నే” అనియు గలదు)
అనగా, కుజుడు 1, 2, 12, 4, 7, 8 స్థానములందు స్త్రీ జాతకమునందున్న భర్తకు, భర్త జాతకమునందున్న
స్త్రీ కి అరిష్టము. లగ్నము శరీరమునకు, చంద్రుడు మనస్సునకు, శుక్రుడు శృంగారమునకు సంకేతములు
కావున ఈ పై చెప్పబడిన స్థానములను జాతకమందు లగ్నము, చంద్రుడు, శుక్రుడు మువ్వురు స్థితి పొందిన స్థానముల నుండి వేరు వేరుగా చూడవలయును.
ఈ దోషమునకు క్రింద ఉదహరించినవి మినహాయింపులుగా చెప్పబడినవి.
కుజ దోష భంగములు :
(1)
కుజుడు స్వ క్షేత్రము లేక ఉచ్చ క్షేత్రము లేక మిత్ర క్షేత్రములందున్న
ఈ దోషము లేదు
(2)
కుజుడు చర రాశులందున్న ఈ దోషము లేదు
(3)
కుజుడు కర్కాటక, సింహా, కుంభములందున్న
ఈ దోషము లేదు
(4)
మిధున కన్యలు రెండవ స్థానమైనను, వృషభ తులలు ఒకటవ
స్థానమైనను, మేష వృశ్చికములు 4వ స్థానమైనను, కర్కాటక మకరములు 7వ స్థానమైనను, ధనుర్మీనములు 8వ స్థానమైనను
ఈ దోషము లేదు.
(5)
కర్కాటక సింహా లగ్నములందు జన్మించిన వారికి ఈ దోషము లేదు
(6)
కుజుడు చంద్ర గురులతో యుతి పొందినను, వారితో చూడబడినను
ఈ దోషము లేదు
(7)
కుజుడు రవి, బుధ, శని, రాహువు లతో యుతి పొందినను, వాటితో చూడబడినను ఈ దోషము
లేదు
(8)
కుజుడు స్థితి పొందిన రాశ్యాధిపతి లగ్నము నుండి గాని, చంద్రుని నుండి
గాని, కేంద్ర కోణములందున్న ఈ దోషము లేదు
(9)
గురుడు గాని, శుక్రుడు గాని లగ్నమునందు స్థితి పొందిన
ఈ దోషము లేదు
అయితే, ఈ కుజ దోషము అనునది ప్రాచీన భారతీయ గ్రంధములందు
లేదు. బృహత్ పరాశర హోరా శాస్త్రము మూల గ్రంధమున
96 అధ్యాయములు గలవు. తదుపరి కాలమున 4 అధ్యాయములు
చేర్చబడి మొత్తం 100 అధ్యాయముల గ్రంధమైనది. ఈ కుజ దోషము అనునది 96 అధ్యాయములు గల మూల గ్రంధమున
కనపడుటలేదు. 100 అధ్యాయములు గల గ్రంధమునందున్న
కారణమున ఇది ప్రక్షిప్త శ్రుత్యక్షమని భావించవలసి యున్నది.