౧౨ సంవత్సరములలోపు మరణాన్ని సూచించే యోగాన్ని "బాలారిష్టం" అందురు.
చంద్రాష్టమంచ ధరణీసుత సప్తమంచ
రాహుర్నవంచ శని జన్మ గురుస్తృతీయే
అర్కస్తు పంచ బృగు షట్క బుధశ్చతుర్దే
కేతుర్వ్యయేతు జనితో మరణాయ సద్య:
అనగా... ౮లో చంద్రుడు, ౭లో కుజుడు, ౯లో రాహువు, లగ్నంలో శని, ౩లో గురుడు, ౫లో రవి, ౬లో శుక్రుడు, ౪లో బుధుడు, ౧౨లో కేతువు బాలారిష్టాలనిస్తారు. కాని, ఆ గ్రహ దశలు జననకాల దశలయితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోష గ్రహంపై శుభ గ్రహ దృష్టి ఆ దోషాన్ని తగ్గిస్తుంది.
బాలారిష్ట భంగాలు :
౧) లగ్నాధిపతి బలంగా ఉండి శుభ గ్రహ యుతిగాని, దృష్టిగాని కలిగి కేంద్ర స్థితిని పొంది పాప గ్రహ యుతి, దృష్టి లేకుంటే బాలారిష్టం పోతుంది.
౨) పూర్ణ చంద్రునిపై శుభ గ్రహ యుతి దృష్టి ఉండి శుభ రాశి, నవాంశలలో గాని, స్వ, ఉచ్చ, మిత్ర వర్గాల్లోగాని ఉంటె బాలారిష్టం పోతుంది.
౩) గురు, శుక్ర, బుధులలో ఒకరైనా కేంద్రాలలో పాప సంభందం (యుతి, దృష్టి) లేకుండా ఉంటె బాలారిష్టం పోతుంది.
౪) శుక్ల పక్షంలో రాత్రిగాని, కృష్ణ పక్షంలో పగలుగాని జన్మించి చంద్రుడు శుభ గ్రహ దృష్టి కలిగి షష్ట అష్టమ స్థానాల్లో ఉంటె బాలారిష్ట భంగం